సంబంధిత వార్తలు
- డెంటిస్ట్ ప్రేమ పెళ్లి.. మనస్తాపంతో తల్లిదండ్రులు ఆత్మహత్య
- కుమార్తె ప్రేమ పెళ్లి చేసుకుందనీ తల్లిదండ్రుల బలవన్మరణం
- పొరుగింటి ఆడ కుక్కపై 67 ఏళ్ల వ్యక్తి అత్యాచారం.. ఎక్కడ?
- మూగ బాలికపై కామాంధుల అకృత్యం... కేకలు వేయలేకపోయింది.. కళ్ల నుంచి నీళ్లు..
- దంపతుల గొడవ.. భార్యపై భర్త దాడి.. 21 రోజుల బాబును అడ్డుపెట్టడంతో..?
వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనం పునరుద్ధరించలేదు : టిటిడి
కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో 2020, మార్చి 20వ తేదీ నుంచి వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలను నిలిపివేయడం జరిగింది. ఇప్పటికి కూడా కోవిడ్ పూర్తి అదుపులోకి రానందువల్ల వీరి దర్శనాల విషయంలో ఇదే స్థితి కొనసాగుతోంది.
అయితే గత కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో తిరుమలలో వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలు పునరుద్ధరించినట్టు అవాస్తవ సమాచారం ట్రోల్ అవుతోంది. అనేకమంది ఇది నిజమని నమ్మి తిరుపతికి వచ్చి ఇబ్బందులు పడే అవకాశం ఉంది. భక్తులు ఈ విషయం గుర్తించాల్సిందిగా టిటిడి విజ్ఞప్తి చేస్తోంది.
కోవిడ్ పూర్తిగా అదుపులోకి వచ్చాక ఈ దర్శనాల పునరుద్ధరణపై తగిన నిర్ణయం తీసుకుని మీడియా ద్వారా భక్తులకు తెలియజేయడం జరుగుతుంది. అధికారిక ప్రకటన వెలువడే వరకు సామాజిక మాధ్యమాల్లో వచ్చే అవాస్తవ సమాచారాన్ని నమ్మవద్దని టిటిడి కోరుతోంది.
తర్వాతి కథనం
