మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శుక్రవారం, 11 మార్చి 2022 (19:34 IST)

వెటర్నరీ కళాశాల భవనంపైకెక్కిన విద్యార్థులు... దూకేస్తామంటూ..?

తిరుపతిలో వెటర్నరీ విశ్వవిద్యాలయం విద్యార్థులు చేపట్టిన ఆందోళన ఉదృతంగా మారింది. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు ఒక్కసారిగా కళాశాల భవనంపైకెక్కారు. న్యాయమైన సమస్యలు పరిష్కరించకుంటూ దూకేస్తామని హెచ్చరించారు.

 
ప్రభుత్వానికి, వెటర్నరీ విశ్వవిద్యాలయ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్టైఫండ్‌ను పెంచడంతో పాటు ఆర్.ఎల్.యు ఉన్నతీకరణ, వెటర్నరీ డయాగ్నోస్టిక్ లేబొరేటరీలో వైద్యులు, శాశ్వత ప్రాతిపదికన వెటర్నరీ డాక్టర్లను నియమించాలని డిమాండ్ చేస్తున్నారు.

 
న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేంత వరకు తరగతులకు హాజరయ్యేది లేదంటున్నారు. ముఖ్యమంత్రి స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల ఆందోళనతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది.