సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 9 మార్చి 2022 (18:02 IST)

తెలుగు రాష్ట్రాల్లో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకాలు

తెలంగాణ సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు నిరుద్యోగులు. నిరుద్యోగులకు శుభవార్త చెప్తూ.. కేసీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రకటనపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్‌ శ్రేణులు, నిరుద్యోగులు సంబురాలు చేసుకుంటున్నారు. తమ అభిమానాన్ని చాటుతూ పాలాభిషేకాలు చేస్తున్నారు. 
 
తెలంగాణలో మాత్రమే కాకుండా.. ఏపీలోనూ తెలంగాణ సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకాలు చేయడం చర్చనీయాంశంగా మారింది. విశాఖలో కేసీఆర్ చిత్రపటానికి ఏపీ నిరుద్యోగ జేఏసీ పాలాభిషేకం చేసింది. 
 
విశాఖ పబ్లిక్ లైబ్రరీ దగ్గర అభినందన సభ కూడా నిర్వహించారు. ఇక, పాదయాత్రలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ నెరవేర్చాలని జేఏసీ డిమాండ్ చేసింది.