టీఎస్ ఎంసెట్–2022 నోటిఫికేషన్ మార్చి 14వ తేదీన విడుదల కానుందని తెలుస్తోంది. తెలంగాణ ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో సోమవారం దీనిపై సమీక్షా సమావేశం జరిగింది. ఇంజనీరింగ్, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఎంసెట్–2022 నోటిఫికేషన్ త్వరలో విడుదల చేసేందుకు రంగం సిద్ధం అవుతున్నట్లు సమాచారం.