శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 24 ఫిబ్రవరి 2022 (22:04 IST)

విద్యార్థులకు శుభవార్త - 2022-23 విద్యా సంవత్సర ప్రవేశాలకు నోటిఫికేషన్

తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు ఇది శుభవార్త. 2022-23 విద్యా సంవత్సర ప్రవేశాల కోసం తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల విభాగం నోటిఫికేషన్ జారీచేసింది. ఈ విభాగం ఆధ్వర్యంలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశానికిగాను ఈ నోటిఫికేషన్‌ను జారీచేసింది. 
 
ఇంటర్ పరీక్షల్లో 40 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించివుండాలి. ఈ నెల 10వ తేదీ నుంచి జనవరి 10వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు స్వీకరిస్తారు. ప్రవేశ పరీక్షను జనవరి 23వ తేదీన నిర్వహిస్తారు. 
 
హైదరాబాద్ నగరంలోని ఇబ్రహీంపట్టణంలోని సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల కాలేజీలో బీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం అడ్మిషన్లను నిర్వహించనున్నారు. పూర్తి వివరాల కోసం తెలంగాణ మహిళా సాంఘిక సంక్షేమ గురుకుల విభాగం వెబ్‌సైట్‌ను చూడొచ్చు.