మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 15 నవంబరు 2024 (16:35 IST)

కాకినాడ సుబ్బయ్య హోటల్‌‌ ఫుడ్‌లో కాళ్ల జెర్రీ... ఎలా సీజ్ చేశారంటే? (video)

Food
తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఫేమస్ అయిన కాకినాడ సుబ్బయ్య హోటల్‌ను ఫుడ్ సేఫ్టీ అధికారులు సీజ్ చేశారు. ఒక వ్యక్తి భోజనంలో జెర్రి కనిపించడంతో జాతీయ మానవ హక్కుల సంఘం ఛైర్‌ పర్సన్‌ విజయభారతి సయాని ఆదేశాలతో అధికారులు మెస్‌ను సీజ్ చేశారు. సిబ్బంది ఆమెను భోజనం చేయడానికి అక్కడకు తీసుకెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. దీంతో షాక్‌కు గురైన ఎన్‌హెచ్‌ఆర్సీ ఛైర్‌ పర్సన్‌ ఆదేశాలతో హోటల్‌ను సీజ్ చేశారు.
 
విజయవాడలోని సుబ్బయ్య హోటల్‌లో ఓ వ్యక్తి గురువారం మధ్యాహ్నం భోజనం చేస్తున్న సమయంలో తినే ఆహారంలో జెర్రీ కనిపించింది. దీంతో కస్టమర్ యాజమాన్యాన్ని నిలదీశాడు. ఆ సమయంలో విజయభారతి సయాని కూడా అక్కడే వుండటంతో అసలు విషయంపై ఆరా తీశారు. తినే ఆహారంలోకి కాళ్ల జెర్రీ ఎలా వస్తుంది, ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కాకినాడ సుబ్బయ్య హోటల్ నిర్వాహకుల తీరుపై ఆమె మండిపడ్డారు. ఆపై జిల్లా ఉన్నతాధికారులకు మానవ హక్కుల కమిషన్ చైర్మన్ స్వయంగా ఫోన్‌ చేసి హోటల్‌పై ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు ఆగమేఘాలపై స్పందించారు. 
 
ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సుబ్బయ్య హోటల్‌ను వెంటనే సీట్ చేయాలని జిల్లా అధికారులు ఆదేశించారు. గురువారం మధ్యాహ్నం సుబ్బయ్య హోటల్ సీజ్ చేశారు. ఇదే తరహాలో అన్ని హోటళ్లలో తనిఖీలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.