బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 6 నవంబరు 2024 (09:56 IST)

వైకాపా నేత పంచ్ ప్రభాకర్‌కు ఏపీ పోలీసుల పంచ్..

punch prabhakar
టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ చీప్, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లతో పాటు ఏపీ హోం మంత్రి అనితలను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వైకాపా నేత పంచ్ ప్రభాకర్‌కు పోలీసులు తేరుకోలేని పంచ్ ఇచ్చారు. ఆయనపై ఏపీలోని పలు ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. తాజాగా పంచ్ ప్రభాకర్‌తో పాటు మరో ఇద్దరిపై విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు వేర్వేరు కేసులు నమోదు చేశారు. 
 
ప్రభాకర్ రెడ్డి చీనేపల్లి అనే వ్యక్తి 'పంచ్ ప్రభాకర్' పేరుతో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నాడు. వైకాపా సానుభూతిపరుడిగా పేరొందిన ఈయన.. తన ఛానల్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఫొటోలను ఉపయోగించి, అసభ్య పదజాలంతో వారిని తిడుతూ వీడియోలు పెట్టాడు. మొగల్రాజపురానికి చెందిన డి.రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు.
 
చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఫొటోలను మార్ఫింగ్ చేసి, వారిని దుర్భాషలాడుతూ పోస్టింగ్లు పెట్టిన వి.బాయిజయంతి అనే ఎక్స్ ఎకౌంట్ హోల్డర్‌పై సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. మొగల్రాజపురానికి చెందిన సాదిరెడ్డి శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది.
 
అసభ్య పదజాలంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై 'ఎక్స్'లో పోస్టులు పెట్టిన వ్యక్తిపై నున్న పోలీసులు కేసు నమోదు చేశారు. పాత పాయకాపురానికి చెందిన జనసేన నాయకుడు శౌరిశెట్టి రాధాకిరణ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.