శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 9 మార్చి 2018 (12:54 IST)

కాంగ్రెస్ మోసం చేస్తే.. బీజేపీ నమ్మక ద్రోహం చేసింది : సుజనా చౌదరి

రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి కాంగ్రెస్ పార్టీ తెలుగు ప్రజలకు ద్రోహం చేస్తే.. తాము అధికారంలోకి వస్తే అన్నీ చేస్తామంటూ నమ్మంచిన భారతీయ జనతా పార్టీ నమ్మక ద్రోహానికి పాల్పడిందంటూ కేంద్ర మాజీ మంత్రి, ట

రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి కాంగ్రెస్ పార్టీ తెలుగు ప్రజలకు ద్రోహం చేస్తే.. తాము అధికారంలోకి వస్తే అన్నీ చేస్తామంటూ నమ్మంచిన భారతీయ జనతా పార్టీ నమ్మక ద్రోహానికి పాల్పడిందంటూ కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత సుజనా చౌదరి ఆరోపించారు. ఆయన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత తొలిసారి మీడియాతో మాట్లాడారు. 
 
తమ రాజీనామాల వెనుక ఎలాంటి దురుద్దేశ్యంగానీ, రాజకీయ ప్రయోజనాలు కానీ లేవన్నారు. కేవలం రాష్ట్ర ప్రజల శ్రేయస్సే దాగివుందన్నారు. అందుకే పార్టీ అధినేత చెప్పినట్టుగా రాజీనామాలు చేసినట్టు తెలిపారు. విభజన హామీలు ఆయా ప్రభుత్వ శాఖల పరిధిలో ఉన్నాయని, ప్రధాని శ్రద్ధ తీసుకుంటే ఇవి త్వరితగతిన పూర్తి కావొచ్చని తెలిపారు. 
 
విభజన హామీల అమలులో జాప్యం జరిగినందువల్లే రాజీనామా చేసినట్టు తెలిపారు. పార్టీ అధినేత నిర్ణయానికి కట్టుబడి తామీ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఈ రాజీనామాలతో తమకు మరింత స్వేచ్ఛ వచ్చినట్టయిందని తెలిపారు. ఏపీకి తన వంతు సాయం చేస్తానని ప్రధాని చెప్పారని వెల్లడించారు. మంత్రి పదవులకు రాజీనామా చేసినందున ఎంపీలుగా పార్లమెంట్‌లో స్వతంత్రంగా వ్యవహరిస్తామన్నారు. 
 
జాతీయ పార్టీలు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదన్నారు. రాష్ట్రం విషయంలో రెండు జాతీయ పార్టీలూ దొందూ దొందూలాగే వ్యవహరించాయన్నారు. ఒక జాతీయ పార్టీ నమ్మక ద్రోహం చేసిందని, మరో జాతీయ పార్టీ మోసం చేసిందని సుజనా ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజాకాంక్షలకు అనుగుణంగా వ్యవహరించాల్సి వచ్చిందన్నారు.