ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 4 మార్చి 2017 (11:03 IST)

హైదరాబాద్ నగరంలో 35.8 డిగ్రీల సెల్షియస్ ఉష్ణోగ్రత.. ఈ ఏడాది ఎండలు మండిపోతాయ్

హైదరాబాద్ నగరంలో శుక్రవారం 35.8 డిగ్రీల సెల్షియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా.. అది ఈ నెలాఖరులోగా 42డిగ్రీల సెల్షియస్‌కు చేరుకుంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ ఏడాది ఎండలు మండిపోతాయని వాతావరణశాఖ

హైదరాబాద్ నగరంలో శుక్రవారం 35.8 డిగ్రీల సెల్షియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా.. అది ఈ నెలాఖరులోగా 42డిగ్రీల సెల్షియస్‌కు చేరుకుంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ ఏడాది ఎండలు మండిపోతాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. 1992 నుంచి 2015 వరకు ఎండదెబ్బ వల్ల 22 వేలమంది మృత్యువాత పడ్డారని జాతీయ వైపరీత్యాల నిర్వహణ సంస్థ తెలిపింది. 
 
2015లో వడదెబ్బ వల్ల 2,400 మంది, 2016లో 1,100 మంది మరణించారని ఆ సంస్థ పేర్కొంది. ఈ ఏడాది మండే ఎండల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని జాతీయ ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ సంస్థ కోరింది.
 
తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. విపరీతమైన ఎండలు, వేడి గాలులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. హైదరాబాద్ నగరంలో రాత్రి ఎనిమిది గంటల తరువాత కూడా వేడి గాలుల ప్రభావం తగ్గలేదు. నిజామాబాద్‌లో రికార్డు స్థాయిలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌లో 42.4 డిగ్రీలు, రామగుండం 45, మెదక్ 44, భద్రాచలం 43, జగిత్యాల 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఆదిలాబాద్‌లో 44.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.