1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ttdj
Last Updated : శనివారం, 4 జూన్ 2016 (13:36 IST)

తిరుపతి రైల్వేస్టేషన్‌ అభివృద్థికి నెలరోజుల్లో శంకుస్థాపనలు : సురేష్ ప్రభు

తిరుపతి రైల్వేస్టేషన్‌ అభివృద్ధికి నెలరోజుల్లో శంకుస్థాపనలు చేస్తామని కేంద్ర రైల్వేశాఖామంత్రి సురేష్ ప్రభు వెల్లడించారు. తిరుపతి రైల్వేస్టేషన్‌ వద్ద తిరుచానూరు క్రాసింగ్‌ స్టేషన్‌ నిర్మాణానికి ఆయన శనివారం శంఖుస్థాపన చేశారు.
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తిరుపతి రైల్వేస్టేషన్‌లో కావాల్సిన సౌకర్యాలపై ఏపీ ప్రభుత్వం నుంచి నివేదిక వస్తే వెంటనే ప్రధాని దృష్టికి తీసుకెళ్ళి అవసరమైన నిధులను మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.
 
వివిధ ప్రాంతాల నుంచి తిరుపతికి వచ్చే రైళ్ళు ఆలస్యమవుతుండటంతో ప్రత్యేకంగా క్రాసింగ్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను గతంలో కేంద్రమంత్రికి పంపారు. ఈ ప్రతిపాదనల ఆధారంగా ఇపుడు క్రాసింగ్ స్టేషన్‌కు శంకుస్థాపన చేశారు.