శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 1 డిశెంబరు 2021 (15:31 IST)

గొంతులో ఇరుక్కుపోయిన చికెన్ ముక్క- ఎలా తొలగించారంటే?

చిత్తూరు జిల్లా, మదనపల్లె, సోమల మండలం రంగసానిపల్లెకు చెందిన నరసింహులు (45) ఆదివారం చికెన్‌ కూర తింటూ పొరపాటున ముక్కను మింగేశారు. అది గొంతులో ఇరుక్కోవడంతో శ్వాస తీసుకోవడంతో పాటు ఏ ఆహారం తీసుకునేందుకు వీలుకాకుండా ఇబ్బంది పడ్డారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడు.
 
మంగళవారం మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి వచ్చారు. ఈఎన్‌టీ వైద్యులు పాల్‌రవికుమార్‌, డాక్టర్‌ సంపూర్ణ ఆయనకు ఎక్స్‌రే, ఎండోస్కోపి ద్వారా పరిశీలించి గొంతులో చికెన్‌ ముక్క ఇరుక్కున్నట్లు గుర్తించారు. గంట పాటు శస్త్రచికిత్స చేసి గొంతులో చిక్కుకున్న చికెన్ ముక్కను తొలగించారు.