బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 20 మార్చి 2021 (09:17 IST)

తెలుగు రాష్ట్రాలలో టీడీపీ ధనిక పార్టీ

తెలుగు రాష్ట్రాలలో టీడీపీ ధనిక పార్టీ టీడీపీ ధనిక పార్టీగా నిలిచింది. 2018-19 సంవత్సరానికిగాను దేశంలో టాప్‌ 10 పార్టీలతో కూడిన జాబితాను ది అసోసియేషన్‌ ఆఫ్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్‌(ఏడీఆర్‌) విడుదల చేసింది.

రూ.193 కోట్ల ఆస్తులతో టీడీపీ నాలుగో స్థానంలో, రూ.188 కోట్ల ఆస్తులతో టీఆర్‌ఎస్‌ ఆరో స్థానంలో, రూ.93 కోట్ల ఆస్తులతో వైసీపీ 8వ స్థానంలో నిలిచాయి. దేశంలో అత్యంత ఎక్కువ ఆస్తులున్న పార్టీ సమాజ్‌వాదీనే.

ఆ పార్టీ.. రూ.572 కోట్లతో అగ్రస్థానంలో ఉండగా నవీన్‌ పట్నాయక్‌ సారథ్యంలోని బీజేడీ రూ.232 కోట్లతో 2వ స్థానంలో ఉంది.

తమిళనాడుకు చెందిన ఏఐఏడీఎంకే రూ.206 కోట్లతో మూడో స్థానంలో నిలిచింది. టీడీపీకి రూ.115 కోట్లు, టీఆర్‌ఎ్‌సకు రూ.152 కోట్లు, వైసీపీకి రూ.79 కోట్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఉన్నాయి.
 
అయితే 2018-19 ఆర్థిక సంవత్సరానికి తమ పార్టీకి రూ.18 కోట్ల చొప్పున లయాబిలిటీస్‌ ఉన్న ట్లు టీడీపీ, జేడీఎస్‌ ప్రకటించాయి.

కాగా బీజేపీ 2,904.18 కోట్ల ఆస్తులను ప్రకటించింది. జాతీయ పార్టీలు వెల్లడించిన ఆస్తుల్లో ఇది 54.29శాతం. కాంగ్రెస్‌ రూ.928.24 కోట్ల ఆస్తులున్నట్లు ప్రకటించింది.