టీడీపీ నేత దేవినేని నెహ్రూకు గుండెపోటు.. కన్నుమూత... సీఎం చంద్రబాబు తీవ్రదిగ్భ్రాంతి
తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేత దేవినేని నెహ్రూ సోమవారం తెల్లవారుజామున 4.25 గంటలకు హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆయన కిడ్నీ సంబంధింత వ్యాధితో బాధఫడుతూ వచ్చారు.
తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేత దేవినేని నెహ్రూ సోమవారం తెల్లవారుజామున 4.25 గంటలకు హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆయన కిడ్నీ సంబంధింత వ్యాధితో బాధఫడుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో.. హైదరాబాద్‌లోని కేర్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఆయన తుదిశ్వాసవిడిచారు. వారం రోజుల క్రితం ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ వచ్చిన... ఇవాళ తెల్లవారుజామున గండెపోటు రావడంతో 4:25 గంటలకు మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాల దృష్ట్యా ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరిన విషయం తెల్సిందే.
కంకిపాడు నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. బెజవాడ రాజకీయాల్లో నెహ్రూ కీలక పాత్ర పోషించారు. ఎన్టీఆర్ హయాంలో ఉన్నత విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. మూడు దశాబ్దాలుగా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన నేత దేవినేని నెహ్రూ. నెహ్రూకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ వార్త తెలిసిన వెంటనే దేవినేని ఉమ, టీడీపీ సీనియర్ నేతలు, నెహ్రూ అనుచరులు హైదరాబాద్ బయల్దేరారు. నెహ్రూ మృతిపట్ల సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నెహ్రూ మరణంతో తాము ఓ గొప్పనాయకుడిని కోల్పోయామని టీడీపీ నేతలు చెబుతున్నారు.