గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 3 మార్చి 2019 (13:06 IST)

ప్రజల కోసం తెరాసలో చేరుతున్నా : ఎమ్మెల్యే సండ్ర

ప్రజల కోసం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి తెరాసలో పార్టీ చేరనున్నట్టు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రకటించారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, తాను టీడీపీ రాజీనామా చేసి త్వరలోనే తెరాస చేరబోతున్నట్లు తెలిపారు. దీంతో ఆయన పార్టీ మారుతారన్న ప్రచారం జోరందుకుంది. 
 
ప్రజల అవసరాలు, నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్‌తో కలిసి పనిచేయాలని అనుకుంటున్నట్లు సండ్ర తెలిపారు. కేసులకు భయపడే వ్యక్తిని అయితే ఎప్పుడో పార్టీ మారేవాడినని స్పష్టంచేశారు. ప్రతిపక్షంలో ఉండి అభివృద్ధి చేయడం కష్టంగా భావించి ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. 
 
తెరాసలో చేరిక తేదీపై కార్యకర్తలతో చర్చించి నిర్ణయం ప్రకటిస్తానని చెప్పారు. తాజాగా సండ్ర పార్టీ మారితే టీడీపీకి తెలంగాణలో మెచ్చ నాగేశ్వరరావు (అశ్వారావు పేట) ఏకైక ఎమ్మెల్యేగా మిగలనున్నారు.