శుక్రవారం, 15 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శనివారం, 18 ఫిబ్రవరి 2017 (03:40 IST)

పసుపు చొక్కా నేను వేసుకొస్తున్నా.. మీకేం రోగం.. ఈ ఖద్దరెందుకు అంటూ విసుక్కున్న బాబు

పార్టీ అధికారిక కార్యక్రమాలు ఎప్పుడు జరిగినా తాను పసుపు చొక్కా, గుర్తింపు కార్డు ధరించి వస్తుంటే మీకేమొచ్చింది.. ఖద్దరు చొక్కాలు వేసుకొస్తున్నారు అంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలుగుదేశం పార్టీ నేతలను నిలదీశారు.

పార్టీ అధికారిక కార్యక్రమాలు ఎప్పుడు జరిగినా తాను పసుపు చొక్కా, గుర్తింపు కార్డు ధరించి వస్తుంటే మీకేమొచ్చింది.. ఖద్దరు చొక్కాలు వేసుకొస్తున్నారు అంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలుగుదేశం పార్టీ నేతలను నిలదీశారు. బడ్జెట్‌ సమావేశాలపై చర్చించేందుకు శుక్రవారం విజయవాడలోని ఎ కన్వెన్షన్‌ సెంటర్‌లో మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులు, ముఖ్య నేతలతో ఒకరోజు వర్క్‌షాపు నిర్వహించిన చంద్రబాబు.. ఉదయం తాను వచ్చేసరికి చాలా మంది నేతలు రాకపోవడంతో తీవ్రంగా అసహనం వ్యక్తం చేశారు.  తాను సీనియర్‌ నేతనని, పార్టీ కార్యకర్తగా పసుపు చొక్కా, గుర్తింపు కార్డు ధరించి వచ్చానని అందరూ అలాగే రావాలన్నారు. వర్క్ షాపుకు కొందరు ఖద్దరు చొక్కాలు వేసుకుని రావడాన్ని తప్పుబట్టారు. 
 
అమరావతిని కేవలం సాఫ్ట్‌వేర్‌ హబ్‌గానే కాకుండా హార్డ్‌వేర్‌ కేంద్రంగా కూడా తీర్చిదిద్దనున్నట్లు ముఖ్యమంత్రి  చెప్పారు.  ఇందుకోసం రూ.200 కోట్లతో ఎన్టీఆర్‌ కాంప్లెక్స్‌లో 106 హార్డ్‌వేర్‌ షాపులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. విజయవాడ ఆటోనగర్‌ ఇండ్‌వెల్‌ టవర్స్‌లో ఏర్పాటు చేసిన ఐటీ సర్వీస్‌ టెక్‌ పార్క్‌ను బాబు శుక్రవారం  ప్రారంభించారు.