శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 2 జులై 2019 (09:38 IST)

విజయసాయికి దిమ్మతిరిగే కౌంటరిచ్చిన దివ్యవాణి...

టీడీపీ మహిళా నేత దివ్యవాణి వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డికి దిమ్మతిరిగిపోయే కౌంటరిచ్చింది. ఈ మేరకు ఆమె ట్విట్టర్ వేదికగా వరుస పోస్టులు చేసింది. ప్రజావేదిక హెరిటేజ్ సొమ్ముతో కట్టారా అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్‌కి కౌంటర్ ఇచ్చారు 
 
"అయ్యా అక్రమ సాయి రెడ్డి గారు... రంజాన్ పేరుతో 6 వేల మందికి భోజనాలు పెట్టడానికి రూ.1.1 కోట్లు (జి.ఓ-1206), ఈ సొమ్ము సండూర్ పవన్ కంపెనీ సొత్తా?
 
జగన్‌గారి ఇంటి ముందు 1.3 కిమీ రోడ్డు వెయ్యడానికి రూ.5 కోట్లు (జి.ఓ-132), ఈ ఖర్చు భారతి సిమెంట్స్ నుండి ఖర్చు చేసారా? జగన్ నివాసం దగ్గర టాయిలెట్స్ కట్టడానికి రూ.30 లక్షలు (జి.ఓ-133), ఈ సొమ్ము జగతి పబ్లికేషన్స్ నుండి కట్టారా? 
 
జగన్‌గారి ప్యాలస్ దగ్గర బ్యారికేడ్లు పెట్టడానికి రూ.75 లక్షలు (జిఓ-133), ఈ సొమ్ము కార్మెల్ ఏషియా చెల్లించిందా? కొట్టేయడంలో మీరు హీహెచ్‌డీ చేశారు. మీ రికార్డులు మీరే తిరగరాస్తున్నారు. ఇక మిగిలింది గుడిలో లింగం మాత్రమే అంటూ మండిపడ్డారు.