శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శనివారం, 29 జూన్ 2019 (11:40 IST)

పప్పుబాబుకు ఉన్న చిటికెడు మెదడు చిట్లిపోయినట్టుంది : విజయసాయి రెడ్డి

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్‌పై వైకాపా రాజ్యసభ శభ్యుడు విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ముగిసిన ఎన్నికల్లో మంగళగిరి ప్రజలు తిప్పికొట్టిన (ఓడించడం) తర్వాత లోకేశ్ మెదడు చిట్లినట్టయింది అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 
 
ఇదే అంశంపై విజయసాయి రెడ్డి శనివారం ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ చేశారు. మంగళగిరి ప్రజలు ఈడ్చికొట్టిన తర్వాత లోకేశ్ చిటికెడు మెదడు మరింత చిట్లినట్టుందని... స్థాయి మరచిపోయి చెలరేగిపోతున్నారన్నారు. చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకుని మీ తండ్రి తమపై కుట్ర చేశారని... ఇప్పుడు అదే చిదంబరం, ఆయన కుమారుడు బెయిల్‌పై బయట ఉన్నారని గుర్తుచేశారు. మీ దొంగల ముఠాకు మూడే రోజు దగ్గర్లోనే ఉందని విజయసాయి రెడ్డి హెచ్చరించారు.