రెండో పెళ్లి.. ఇద్దరు పిల్లలున్నారు.. అయినా పెళ్లికి ఒప్పుకుంటే... వరుడు పరార్
ఆయన ప్రభుత్వ ఉపాధ్యాయుడు.. పైగా రెండో పెళ్లి. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయినప్పటికీ.. తన కుమార్తె బాగుంటుందని రెండో పెళ్లి ఇచ్చేందుకు సైతం ఆ తండ్రి మనసు చంపుకుని అంగీకరించాడు. అయితే, ఆ పెళ్లి కుమార
ఆయన ప్రభుత్వ ఉపాధ్యాయుడు.. పైగా రెండో పెళ్లి. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయినప్పటికీ.. తన కుమార్తె బాగుంటుందని రెండో పెళ్లి ఇచ్చేందుకు సైతం ఆ తండ్రి మనసు చంపుకుని అంగీకరించాడు. అయితే, ఆ పెళ్లి కుమారుడు మాత్రం రెండు పెళ్లి అనగా ముందురోజే పారిపోయాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. చిత్తూరు జిల్లాలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే..
చిత్తూరు జిల్లా పీటీఎం మండలం ఉప్పరవాండ్లపల్లెకు చెందిన యువకుడు గంగాధర్ మండల కేంద్రం సమీపంలోని తాకాటంవారిపల్లెలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఇతడికి ఇద్దరు పిల్లలు. ఇటీవల అతడి భార్య అనారోగ్యంతో మృతి చెందింది. కుటుంబంలోని సంప్రదాయం మేరకు యేడాదిలో మరో పెళ్లి చేసుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టాడు.
కడప జిల్లా రాయచోటీకి చెందిన బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిని స్వరూపారాణితో ఈ నెల 23న వివాహం నిశ్చయమైంది. పెళ్లి బి.కొత్తకోటలోని శివాలయంలో చేయాలని నిర్ణయించారు. 22వ తేదీ రాత్రి వధువు, ఆమె తరపున బంధువులతో బి.కొత్తకోటకు చేరుకున్నారు. తెల్లారితే పెళ్లి.. అయితే అప్పటికే గంగాధర్ పిల్లలతో సహా పరారయ్యాడు. విషయం తెలుసుకున్న వారు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఇరువైపు కుటుంబాల పెద్దలు గంగాధర్‌తో రెండు రోజులుగా ఫోన్‌లో సంప్రదింపులు జరపగా... తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని తెలిపి తన ఫోన్ స్విచ్చాఫ్ చేసుకున్నాడు. బాధిత యువతికి మోసం చేసిన గంగాధర్‌పై చట్టపర చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆశ్రయించింది.