శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 12 మార్చి 2019 (11:08 IST)

అనుమానంతో భార్యను ఇనుపరాడ్డుతో కొట్టి చంపేసిన భర్త..

అనుమానం పెనుభూతమైంది. ఫలితంగా ఓ కసాయి భర్త తన భార్యను ఇనుప రాడ్డుతో కొట్టి చంపేశాడు. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ పట్టణ శివారులోని పీకే రామయ్యకాలనీలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, గ్రామానికి చెందిన లావుడియా రాములు అనే వ్యక్తి రమాదేవి(32) అనే వివాహితను కొన్నేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. వీరికి పిల్లలు కూడా ఉన్నారు. అయితే, రమాదేవికి అదే ప్రాంతానికి చెందిన మరో వ్యక్తితో అక్రమ సంబంధం ఉన్నట్టు రాములు అనుమానిస్తూ వచ్చాడు. 
 
ఈ క్రమంలో వారిద్దరి మధ్య మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. తాజాగా పీకల వరకు మద్యం సేవించి వచ్చిన రాములు... భార్యతో గొడవపడ్డాడు. వారిమధ్య ఘర్షణ పెద్దది కావడంతో ఇంట్లోని ఇనుప రాడ్‌తో రమాదేవి తలపై బాదడంతో తీవ్ర గాయమై సృహ కోల్పోయింది. గమనించిన కుటుంబ సభ్యులు గోదావరిఖనిలోని ప్రైవేటు దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమించగా కరీంనగర్‌కు తరలించే క్రమంలో మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.