శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 17 ఆగస్టు 2020 (08:53 IST)

కొడుకు విదేశాల్లో... కోడలి కోర్కె తీర్చమన్న 60 యేళ్ల మామ.. ఎక్కడ?

కొందరికి వయసు మీదపడుతున్న బుద్ధి మాత్రం మారడం లేదు. కుటుంబ పోషణ నిమిత్తం కుమారుడు విదేశాల్లో ఉంటే.. తమ వద్ద ఉన్న కోడలిని కన్నబిడ్డలా చూసుకోవాల్సిన ఓ మామ... ఆమెపై కన్నేసి.. పడక సుఖం పొందాలని పరితపించాడు. తనపట్ల మామ ప్రవర్తనను పసిగట్టిన ఆ మహిళ.. పెద్ద మనుషులకు వివరించి మందలించింది. అయినప్పటికీ 60 యేళ్ల వృద్ధుడి బుద్ధి మారలేదు. దీంతో పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి మండలం లింగాపూర్‌లో వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, కామారెడ్డి మండలం లింగాపూర్‌కు చెందిన 60 ఏళ్ల మల్లేశంకు కుమారుడు ఉన్నాడు. అతడు విదేశాల్లో ఉండడంతో కోడలు ఇంటి వద్దే ఉంటుంది. ఇదే అదనుగా కోడలిపై మామ కన్నేశాడు. 
 
లైంగిక వేధింపులకు యత్నించడంతో ఇటీవలే ఆమె ఆత్మహత్య యత్నానికి సైతం ఒడిగట్టినట్లు తెలిసింది. మామ బుద్ధి మారక పోవడంతో సమీప బంధువులకు చెప్పుకుని అంతా కలిసి ఆదివారం నిలదీశారు. అనంతరం దేవునిపల్లి పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు మల్లేశంపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.