శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 24 జులై 2020 (11:12 IST)

కరోనాను జయించిన ధ్రువ సర్జా, ప్రేరణ.. వారికి కృతజ్ఞతలు

కన్నడ నటుడు ధ్రువ సర్జా, ఆయన సతీమణి ప్రేరణ కరోనాను జయించారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కోవిడ్ పరీక్షల్లో ఇద్దరికి నెగిటివ్ వచ్చినట్లు తెలిపాడు ధ్రువ.

కష్టసమయంలో మద్దతుగా నిలిచిన కుటుంబం సహా అభిమానులకు కృతజ్ఞతలు చెప్పుకొచ్చాడు. అంతేకాదు వారిద్దరికీ వైద్యం చేసిన డాక్టర్. సుర్జిత్ పాల్ సింగ్, అతడి వైద్య బృందానికి ధన్యవాదాలు తెలిపాడు.
 
మరోవైపు యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె, నటి ఐశ్వర్య అర్జున్​ కూడా కరోనా బారిన పడ్డారు. ఐశ్వర్య ప్రస్తుతం హోమ్​ క్వారంటైన్​లో ఉండి చికిత్స పొందుతోంది. కన్నడ చిత్రం 'పొగరు'లో హీరోగా నటించాడు ధ్రువ. ఇందులో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది. కాగా ధ్రువ సోదరుడు, హీరో చిరంజీవి సర్జా ఇటీవల గుండెపోటుతో ఆకస్మికంగా మరణించిన సంగతి తెలిసిందే.