శుక్రవారం, 18 జులై 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 29 జులై 2016 (11:01 IST)

ప్రత్యేక హోదా, ప్యాకేజీ రెండూ ఇవ్వాలి: టీడీపీ ఎంపీ టీజీ.వెంకటేశ్‌

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విభజించారని, అందువల్ల ప్రత్యేక హోదాతో పాటు.. ప్యాకేజీ రెండూ ఇవ్వాలని టీడీపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ అన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విభజించారని, అందువల్ల ప్రత్యేక హోదాతో పాటు.. ప్యాకేజీ రెండూ ఇవ్వాలని టీడీపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విభజనను అశాస్త్రీయంగా చేశారు. ఎంపీలకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. చర్చకు కూడా అవకాశం ఇవ్వలేదని గుర్తు చేశారు.
 
రాజ్యసభలో చర్చ సందర్భంగా ప్రధానమంత్రి ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. ప్రతిపక్షం కూడా విభజనకు మద్దతు ఇచ్చింది. అయితే, ప్రత్యేక హోదా పదేళ్లు ఇవ్వాలని వెంకయ్యనాయుడు కోరారు. అధికారంలోకి వచ్చేది తామేనని, పదేళ్లు అమలు చేస్తామని గట్టిగా హామీ ఇచ్చారు. ఇప్పుడు కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా అర్హత లేదంటోంది. కానీ, ఆర్థికంగా వెనకబడిన, మౌలిక సదుపాయాలు లేని, రాజధాని లేని ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదాకు అర్హమే అని టీజీ వ్యాఖ్యానించారు.