సోనియా మాట జగన్ వినివుంటే.. సీమాంధ్రులకు కష్టాలుండేవి కాదు : టీజీ వెంకటేష్
సీమాంధ్ర ప్రజలు పలు కష్టాలు పడటానికి ప్రధాన కారణం విపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని టీడీపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ ఆరోపించారు. నాడు.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మాట విని.. జగన్ కాంగ్రె
సీమాంధ్ర ప్రజలు పలు కష్టాలు పడటానికి ప్రధాన కారణం విపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని టీడీపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ ఆరోపించారు. నాడు.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మాట విని.. జగన్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగివున్నట్టయితే ఈ పరిస్థితి వచ్చేది కాదని ఆయన చెప్పుకొచ్చారు.
అందువల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు ముక్కలు కావడానికి ప్రధాన కారణం జగన్ అని, ఆయన తొందరపాటు నిర్ణయం కారణంగానే ఏపీ ప్రజలు ఇపుడు అనేక కష్టాలు పడాల్సి వస్తోందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీని వీడి... జగన్ సొంతగా వైకాపాను జగన్ స్థాపించడం వల్లే వీడటంతోనే రాష్ట్రం ముక్కలైందన్నారు.
జగన్ సీఎం పదవి కావాలని అనుకున్నారని, అలా అనుకోకుండా, సోనియా గాంధీ చెప్పిన మాట వినుంటే రాష్ట్ర విభజన జరిగేది కాదని అన్నారు. జగన్ బయటకు రావడంతోనే తప్పనిసరి పరిస్థితుల్లో విభజనకు కాంగ్రెస్ అంగీకరించిందని అన్నారు. సీమాంధ్ర ప్రజల కష్టాలకు జగన్ వైఖరే కారణమని ఆరోపించారు.