గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: బుధవారం, 12 మే 2021 (22:21 IST)

నా అక్కచెల్లమ్మలైన నర్సులందరికీ కృతజ్ఞతలు: సీఎం వైయ‌స్ జగన్ ట్వీట్‌

అమరావతి: అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా నిస్వార్ధంగా సేవ చేస్తూ ప్ర‌తి వారిని తమ సొంతవారిలా చూసే న‌ర్సులకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృతజ్ఙతలు తెలియజేశారు.

ఈ మేరకు ఆయ‌న ట్విటర్‌ ద్వారా స్పందించారు. ‘‘ప్రపంచ వ్యాప్తంగా, ముఖ్యంగా ఏపీలో కరోనా మహమ్మారిని ఎదుర్కొంటూ ఎంతో మందికి నిస్వార్ధంగా సేవలందిస్తున్నారు నా అక్క చెల్లమ్మలైన నర్సులు. వారందరికీ మనస్పూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.’’ అంటూ సీఎం జ‌గ‌న్ ట్వీట్‌ చేశారు.