శనివారం, 2 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: ఆదివారం, 17 మార్చి 2024 (19:44 IST)

ఈ యుద్ధం ఫలితం ధర్మందే విజయం, కూటమిదే గెలుపు, పొత్తుదే గెలుపు: పవన్ కల్యాణ్

pawan kalyan
కర్టెసి-ట్విట్టర్
చిలకలూరిపేటలో జరిగిన ప్రజాగళం సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైసిపి పాలనను తూర్పారపట్టారు. ఏపీలోని రావణ పాలనను అంతమొందించేందుకే కూటమి ఏర్పాటయ్యిందని అన్నారు. గుజరాత్ రాష్ట్రంలోని ద్వారక నుంచి వచ్చిన నరేంద్ర మోదీ పాంచజన్యం పూరించి యుద్ధం ప్రకటిస్తారని అన్నారు. ఈ యుద్ధం ఫలితం ధర్మందే విజయం, కూటమిదే గెలుపు, పొత్తుదే గెలుపు అని అన్నారు.
 
ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ... ఎన్టీఆర్ మరపురాని మనిషి. నటుడిగా రాముడు, కృష్ణుడు పాత్రల్లో ఆయన జీవించారు. ప్రజానాయకుడిగా జీవితాంతం రైతులు, పేదల హక్కుల కోసం పోరాడారు అని అన్నారు.
 
పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని బొప్పూడిలో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీ బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు వైసిపి పాలనపై విమర్శనాస్త్రాలు సంధించారు. '' అసమర్థ, అవినీతికర పాలన మూలంగా ఆంధ్రప్రదేశ్ ఎంతో నష్టపోయింది. ప్రభుత్వ భవనాలు, కాలేజీ భవనాలు సైతం తాకట్టు పెట్టబడ్డాయి. మద్యం ఏరులై పారుతోంది. ప్రజలకు భవిష్యత్తు లేకుండా పోయింది. ఈ పరిస్థితుల నుండి రాష్ట్రాన్ని నిలబెట్టడానికే ఈ పొత్తు'' అని నారా చంద్రబాబు నాయుడు అన్నారు.