1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 2 అక్టోబరు 2016 (16:11 IST)

ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ప్రసాదంలో పురుగులు.. 50వేల లడ్డూలు సీజ్..

నవరాత్రులను పురస్కరించుకుని దుర్గమ్మ ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య భారీగా ఉంటుందనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భక్తుల ప్రసాదం, భక్తులకు ఏర్పాటైన సౌకర్యాలపై అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇంద్రకీలా

నవరాత్రులను పురస్కరించుకుని దుర్గమ్మ ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య భారీగా ఉంటుందనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భక్తుల ప్రసాదం, భక్తులకు ఏర్పాటైన సౌకర్యాలపై అధికారులు తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మవారి ప్రసాదంలో పురుగులు వస్తున్నాయని ఆదివారం భక్తులు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌లు తనిఖీలు నిర్వహించారు. ఆలయ పైభాగంలో ఉన్న ప్రసాద తయారీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనకీ చేసిన అధికారులు.. పురుగులు నిండి ఉన్న రూ.5 లక్షల విలువైన 50వేల లడ్డూలను సీజ్ చేశారు. 
 
ఇదిలా ఉంటే.. దసరా ఉత్సవాలకు సర్వాంగసుందరంగా తీర్చిదిద్దిన ఇంద్రకీలాద్రి, దుర్గమ్మ ఆలయ పరిసరాలను డోన్‌ కెమెరాతో చిత్రీకరిస్తున్నారు. రాజగోపురం, ఘాట్‌రోడ్డు, అర్జున వీధితో పాటు ఆలయ ప్రాంగణంలో భక్తుల రద్దీ, అమ్మవారి బంగారు గోపురం, పచ్చదనంతో మెరిసిపోతున్న ఇంద్రకీలాద్రి అందాలను డోన్‌ కెమెరాతో బంధించారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు విజయవాడలోని ఇంద్రకీలాద్రి ముస్తాబయింది. దుర్గమ్మ ఆలయ పరిసరాలను సర్వాంగసుందరంగా అలంకరించారు.