ఏపిలో దారుణం: బాలికను రేప్ చేసిన టిక్ టాక్ స్టార్
ఏపీలో దారుణం జరిగింది. ఓ బాలికను మాయమాటలతో లోబరుచుకుని గర్భవతిని చేసిన కేసులో టిక్‌టాక్ భార్గవ్‌ను దిశ పోలీసులు అరెస్ట్ చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే అతన్ని కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి వచ్చే నెల మూడో తేదీ వరకు రిమాండ్ విధించారు.
అసలు వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ నగరానికి చెందిన భార్గవ్ "ఫన్ బాస్కెట్ " పేరుతో టిక్ టాక్ వీడియోలు చేసేవాడు. టిక్ టాక్ నిషేధించడంతో మోజో, రేపోసో వంటి యాప్‌లలో ప్రస్తుతం వీడియోలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే భార్గవ్‌కు పెందుర్తికి చెందిన ఓ బాలిక పరిచయమైంది.
ఆమెకు మాయమాటలు చెప్పి శారీరకంగా లోబరుచుకున్నాడు. గర్భవతి కావడంతో ఆమెను దూరం పెట్టాడు. దీంతో విశాఖ దిశ పోలీసులను ఆశ్రయించింది. బాలిక ఫిర్యాదు మేరకు భార్గవ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.