గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: సోమవారం, 12 ఏప్రియల్ 2021 (18:32 IST)

కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న జెఈవో శ్రీమతి సదా భార్గవి

టీటీడీ జెఈవో శ్రీమతి సదా భార్గవి సోమవారం కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నాను. టీటీడీ పరిపాలన భవనం ప్రాంగణంలోని టీటీడీ కేంద్రీయ వైద్యశాలలో ఆమె వ్యాక్సిన్ వేయించుకున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఉద్యోగులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆమె పిలుపు నిచ్చారు.
 
తెలుగు ప్రజలకు టీటీడీ చైర్మన్ ఉగాది శుభాకాంక్షలు
తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త సంవత్సరంలో శ్రీ వేంకటేశ్వర స్వామి దయతో  ప్రజలందరికీ సంపూర్ణ ఆరోగ్యం, ఆనందం కలగాలని ఆయన కోరారు.
 
సంక్లిష్ట పరిస్థితుల్లో ప్రజలందరూ క్రమశిక్షణతో మెలగుతూ, కోవిడ్ నిబంధనలు పాటించాలని శ్రీ సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు. మనం ఆరోగ్యంగా ఉంటూ సమాజాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ నిబంధనలు అనుసరించి 45 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని శ్రీ సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు.