ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 17 ఏప్రియల్ 2021 (11:27 IST)

తిరుపతిలో ఉప ఎన్నిక పోలింగ్.. వైసీపీ దొంగ ఓట్లు..?

తిరుపతిలో పార్లమెంట్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. అయితే, కొన్ని చోట్ల ఉద్రిక్తకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. తిరుపతి ఎన్నికల కోసం వైసీపీ బయట నుంచి వ్యక్తులను తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయిస్తుందని, ఎన్నికల సంఘానికి, పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని టీడీపీ నేతలు ఆందోళనలు చేస్తున్నారు. 
 
తిరుపతిలోని లక్ష్మీపురం, కెనడీ నగర్ సెంటర్ లో టీడీపీ నేతలు రోడ్డుపై భైఠాయించారు. కల్యాణమండపంలో బయట నుంచి వచ్చిన వ్యక్తులపై ఫిర్యాదు చేయగా అక్కడి నుంచి వారంతా జారుకున్నారు. ఎన్నిసార్లు ఎన్నికల సంఘానికి, పోలీసులకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని,అందుకే నిరసనలు తెలియజేస్తున్నామని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ పేర్కొన్నారు.