1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ttdj
Last Updated : శనివారం, 3 డిశెంబరు 2016 (13:09 IST)

తిరుపతి, తిరుమలను వణికిస్తున్న చలి

ఆధ్మాత్మికక్షేత్రం తిరుపతిని చలి వణికిస్తోంది. ఉదయం 9 గంటలైనా చలి తీవ్రత తగ్గడం లేదు. నగర వాసులు చలికి గజగజా వణికిపోతున్నారు. ఇక సాధారణ పనులు నిమిత్తం ఉదయాన్నే తిరిగే వారైతే స్వెట్టర్లు, మఫ్లర్‌, చేతి

ఆధ్మాత్మికక్షేత్రం తిరుపతిని చలి వణికిస్తోంది. ఉదయం 9 గంటలైనా చలి తీవ్రత తగ్గడం లేదు. నగర వాసులు చలికి గజగజా వణికిపోతున్నారు. ఇక సాధారణ పనులు నిమిత్తం ఉదయాన్నే తిరిగే వారైతే స్వెట్టర్లు, మఫ్లర్‌, చేతికి గ్లౌసులు వేసుకుని తిరుగుతున్నారు. ఎముకలు కొరికే విధంగా చలి ప్రజలను వణికిస్తోంది.
 
ఇక ప్రపంచ నలుమూలల నుంచి తిరుమలకు వచ్చే భక్తుల పరిస్థితి వర్ణణాతీతంగా మారింది. తిరుపతిలోని అలిపిరి నుంచి ప్రారంభమైనప్పటి నుంచి ఘాట్‌ రోడ్డు పొడవునా చల్లటి వాతావరణం కనిపిస్తోంది. శేషాచలం కొండలను మంచు దుప్పటి కప్పేయడంతో ఆ వాతావరణాన్ని చూస్తున్న భక్తులు తన్మయత్వంలోకి వెళ్ళిపోతున్నారు. తిరుమలలో స్వెటర్లు, మఫ్లర్లను అమ్మడమే పనిగా కొంతమంది షాపుల యజమానులు పెట్టుకున్నారు.