శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 4 జూన్ 2019 (15:25 IST)

తిరుపతిలో దారుణం... మామ కళ్ళలో కారం చల్లిన కోడలు

ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో దారుణం జరిగింది. ఆస్తి తన భర్త పేరిట రాయలేదన్న కోపంతో మామ కళ్లలో కోడలు కళ్ళలో కారం చల్లింది. ఆ తర్వాత తన భర్తతో కలిసి మామపై దాడి చేసింది. ఈ దాడి దృశ్యాలను కొందరు స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యాయి. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తిరుపతి పట్టణంలోని అనంత వీధికి చెందిన ఓ వృద్ధుడు తన కుమారుడు, కోడలితో కలిసి నివసిస్తున్నాడు. ఆ వృద్ధుడు పేరు మీద ఉన్న ఆస్తిని తన పేరుకు రాసివ్వాలంటూ ఎప్పటినుంచే వేధిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం తండ్రిపై దౌర్జన్యం చేశాడు. 
 
ముఖ్యంగా, కోడలు తన ప్రతాపం చూపింది. మామ కళ్ళలో కారం చల్లింది. దీంతో కళ్ళు మంటలతో తల్లడిపోతున్నా ఏమాత్రం కనికరం చూపని కన్నబిడ్డ అతనిపై దాడి చేశారు. ఇదంతా వీధిలో జరగడంతో స్థానికులు కొందరు వీడియో తీసి పోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇవి వైరల్ అయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని విచారణ చేస్తున్నారు.