సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By
Last Updated : ఆదివారం, 2 జూన్ 2019 (18:40 IST)

భర్తల కాళ్లను భార్యలు వత్తాలట.. లేకుంటే సంపదలు రావట.. మీకు తెలుసా?

ఆధునికయుగం, హడావుడి జీవితం, యాంత్రికంగా మారిన ప్రజలు.. సడలిపోతున్న కుటుంబ విలువలు. ప్రస్తుతం ఇదే.. మానవ జీవితంగా మారిపోయింది. ఎప్పుడూ ఉద్యోగాలు, హడావుడిగా గడిపేయడం ప్రస్తుతం ప్రజలు బాగా అలవాటు పడిపోయారు. వీటికి తోడు ఆధునిక పరికరాలు వచ్చేశాక వాటితో గడిపే వారి సంఖ్య కూడా పెరిగిపోతుంది. 
 
ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియా. ఈ రెండింటి ప్రభావంతో కుటుంబంలోని సభ్యులు ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకోని పరిస్థితి ఏర్పడింది. అయితే సోషల్ మీడియా కొన్ని నెగటివ్ ఫలితాలను ఇచ్చినా.. మరికొన్ని సందేశాలు, ఉపయోగకరమైన విషయాలను కూడా వాటిలో పోస్టు చేయడం జరుగుతుంది. 
 
ఇలా పురాతన అంశాలు, యోగా, ఆధ్యాత్మికం వంటి సంస్కృతికి సంబంధించిన అంశాలు కూడా సోషల్ మీడియా ప్రస్తుతం కథనాల రూపంలో చక్కర్లు కొడుతున్నాయి. అలాంటి వాటిలో ఓ చిన్న కథనం గురించి ఇప్పుడు చూద్దాం.. ప్రస్తుతం భార్యాభర్తల మధ్య అనుబంధాలు అంతంత మాత్రంగానే వున్నాయి. భార్యాభర్తలు అన్యోన్యంగా జీవించడాన్ని చాలామటుకు విస్మరిస్తున్నారు. 
 
యాంత్రిక జీవితానికి అలవాటుపడి ప్రేమను దూరం చేసుకుంటున్నారు. అయితే స్థితికర్త విష్ణుమూర్తికి శ్రీమహాలక్ష్మీదేవి అంటే పరమ ఇష్టం. అందుకే తిరుమల కొండకు వచ్చే ముందు భక్తులు తిరుచానూరు అమ్మవారిని దర్శించుకుని వచ్చాకే వెంకన్నను దర్శించుకుంటారు. అమ్మవారిని దర్శించుకుని కొండపైకి తన వద్దకు వచ్చే భక్తులంటే శ్రీవారికి చాలా ఇష్టమట. 
 
అలాంటి శ్రీహరి అంటే కూడా శ్రీలక్ష్మికి పరమ ప్రీతి. అలాంటి శ్రీలక్ష్మి మహావిష్ణువు కాళ్లను ఎందుకు వత్తుతూ కనిపిస్తుందనే దానిపై సోషల్ మీడియాలో కథనం వచ్చింది. ఆ కథనంలో మహావిష్ణువు కాళ్లను లక్ష్మీదేవి వత్తడం వెనుక ఓ రహస్యం వుందట. పురుషుల మోకాలి నుంచి పాదాల వరకు శనీశ్వరుడు నివాసం వుంటాడట. అలాగే మహిళల మోచేతి నుంచి చేతివేళ్ల వరకు శుక్రుడు నివాసం చేస్తాడట. 
 
అలా మహిళలు తమ చేతులారా పురుషుల (భర్తలు) కాళ్లను వత్తడం ద్వారా శనీశ్వరుడిపై ఒత్తిడి పడుతుందట. ఇలా శుక్రుడు ఒత్తిడి శనిపై పడితే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని విశ్వాసం. అందుకే లక్ష్మీదేవి.. శ్రీపతి కాళ్లను వైకుంఠంలో వత్తుతూ వుంటుందట. అలా చేయడం ద్వారానే లక్ష్మీ దేవి సిరులకు అధిపతిగా మారిందని నమ్మకం.