పాలపిట్ట హన్సికతో మళ్లీ శింబు ప్రేమాయణం.. ఎలా మొదలైందంటే?  
                                       
                  
				  				  
				   
                  				  కోలీవుడ్ హీరో శింబు మళ్లీ ప్రేమలో పడ్డాడని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. నయనతార మాజీ ప్రేమికుడిగా పేరున్న శింబు.. ఆపై పాలపిట్ట హన్సిక ప్రేమలో పడ్డాడు. అయితే వీరిద్దరి మధ్య బ్రేకప్ అయిపోయింది. ఇటీవలే శింబు సోదరుడి వివాహం జరిగిపోయింది. ఈ నేపథ్యంలో శింబు మళ్లీ హన్సిక ప్రేమలో వున్నాడని తెలిసింది. 
	
				  
	 
	గతంలో మనస్పర్థల కారణంగా హన్సిక దూరం కావడం వల్ల కొంతకాలం డీలా పడిపోయిన శింబు.. తర్వాత కోలుకుని సినిమాలు చేస్తూ వస్తున్నాడు. తాజాగా శింబు - హన్సిక కలిసి నటించనున్నారనేది తాజా సమాచారం. 
				  											
																													
									  
	 
	హన్సిక 50వ చిత్రంగా, జమీల్ దర్శకత్వంలో 'మహా' రూపొందుతోంది. ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో శింబు కనిపించనున్నట్టు సమాచారం. శింబు పేరునే హన్సిక సూచించిందని కోలీవుడ్ వర్గాల్లో టాక్. ఆమె రిక్వెస్ట్ చేయడం వల్లనే శింబు ఓకే అన్నాడని దర్శకుడే స్వయంగా చెప్పాడు. 
				  
				  
	 
	ఈ సినిమాతో తాము మళ్లీ కలిసిపోయినట్టుగా హన్సిక కూడా స్పందించింది. ప్రస్తుతం ఈ ఇద్దరి కాంబినేషన్లో కొన్ని రొమాంటిక్ సీన్స్‌ను చిత్రీకరిస్తున్నారు. విడిపోయిన జంట మళ్లీ కలిసి తెరపై కనిపించనుండటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. మళ్లీ ప్రేమపక్షులు ఒక్కటయ్యాయని సినీ పండితులు అంటున్నారు.