గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 10 ఏప్రియల్ 2019 (18:36 IST)

శింబు సోదరుడి వివాహం.. రజనీకాంత్‌కు ఆహ్వానం.. ముస్లిం అమ్మాయితో పెళ్లి..

కోలీవుడ్ హీరో మాజీ నయన ప్రేమికుడు శింబు సోదరునికి త్వరలో వివాహం జరుగనుంది. ముస్లిం మతానికి చెందిన ప్రియురాలిని సంగీత దర్శకుడు కురలరసన్ పెళ్లాడనున్నాడు. అందుకే ఇటీవల ఇస్లాం మతాన్ని కురలరసన్ స్వీకరించాడు. కురలరసన్ వివాహం ఈ నెల 26న చెన్నైలో జరగుతుందని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. 
 
నిబిలా అహ్మద్ అనే యువతి, కురలరసన్‌ గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరి వివాహానికి ఇరు కుటుంబాలు అంగీకరించాయి. కాగా, సోదరుడి వివాహంపై శింబు హర్షం వ్యక్తం చేశాడు. 
 
మరోవైపు కురలరసన్‌ తండ్రి, దర్శక-నిర్మాత టి.రాజేందర్ పెళ్లి పత్రికలు పంచడంలో బిజీగా ఉన్నారు. తాజాగా రాజేందర్ కుమారుడు కురలరసన్‌‌తో కలిసి సూపర్ స్టార్ రజనీకాంత్‌కు పెళ్లి పత్రికను అందజేశారు. 
 
ఇక కురలరసన్ వివాహ రిసెప్షన్ చెన్నైలో ఏప్రిల్ 29న నిర్వహిస్తున్నారు. ఇంకా డీఎండీకే చీఫ్ విజయకాంత్‌ను కూడా టీఆర్ కురలసరన్ వివాహానికి ఆహ్వానించారు. ఇంకా సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులను ఆహ్వానించే పనుల్లో టీఆర్ బిజీబిజీగా వున్నారు.