సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ప్రీతి చిచ్చిలి
Last Updated : శుక్రవారం, 8 మార్చి 2019 (14:15 IST)

శింబు ఇంట పెళ్లి సందడి... పెళ్లి ఎవరికో తెలుసా?

కోలీవుడ్‌లో పెళ్లి సిద్ధంగా ఉన్న హీరోలలో ఇప్పుడు విశాల్ పెళ్లి హైదరాబాద్ అమ్మాయితో కుదిరిపోగా, పెళ్లి డేట్ అనౌన్స్ చేయాల్సి ఉంది. ఇక ఆర్య పెళ్లి హీరోయిన్ సాయేషా సైగల్‌తో 10వ తేదీన హైదరాబాద్‌లో జరగనుంది. ఇక మిగిలినవారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది శింబు గురించి.


రెండుసార్లు ప్రేమ విఫలమైన తర్వాత ఇంక వాటి జోలికి పోకుండా సైలెంట్‌గా ఉంటున్నారు ఈ హీరో. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో తన చెల్లి పెళ్లి తర్వాత తాను పెళ్లి చేసుకుంటానని శింబు చెప్పారు. ప్రస్తుతం శింబు ఇంట్లో పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
 
అయితే పెళ్లి శింబుకి కాదండోయ్, ఆయన సోదరుడు కురళరసన్‌కు. శింబు తమ్ముడైన కురళరసన్‌ "ఇది నమ్మ ఆళు" సినిమాతో సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు. ఇటీవల ఆయన ఆయన మతం మారి ఇస్లామ్‌ను స్వీకరించారు. ప్రేమ కోసమే ఆయన మతం మారినట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లే ప్రస్తుతం శింబు ఇంట్లో సైలెంట్‌గా జరిగిపోతున్నాయి. ఏప్రిల్ 26న జరగనున్న ఈ పెళ్లికి సంబంధించి టీ.రాజేందర్‌ కుటుంబం నుండి అధికారిక ప్రకటన త్వరలో వచ్చే అవకాశం ఉంది.