శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (09:49 IST)

వయసులో తనకంటే 16 యేళ్ల చిన్నదాన్ని పెళ్లాడనున్న తమిళ హీరో

టాలీవుడ్ యువ హీరో అఖిల్ అక్కినేని నటించిన చిత్రం "అఖిల్". ఈ చిత్రంలో హీరో సరసన నటించిన హీరోయిన్ సాయేషా. ఈమెకు పెళ్లి ఫిక్స్ అయింది. అలాగే, తమిళ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా ఉన్న హీరో ఆర్యను ఈమె పెళ్లి చేసుకోనుంది. 
 
వీరిద్దరి వివాహం వచ్చే నెల పదో తేదీన హైదరాబాద్‌లోనే వీరి వివాహం జరుగనుంది. కోలీవుడ్‌లో లేడీ ఫాలోయింగ్‌ అధికంగా ఉన్న హీరోగా క్రేజ్‌ సంపాదించిన ఆర్య కొన్ని నెలల క్రితం తన కాబోయే భార్యను ఎంపిక చేసేందుకు టీవీ షోలో నటించారు. 
 
ఈ నేపథ్యంలో 'భలే భలే మగాడివోయ్' చిత్రంలో తొలిసారిగా ఆర్య, సాయేషా జంటగా నటించారు. ఆ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని, అది కాస్తా పెళ్లి వరకు వెళ్లిందట. తాజా సమాచారం మేరకు మార్చి 10న ముస్లిం ఆచారం మేరకు ఆర్య, సాయేషా పెళ్లి జరుగుతుందని తెలుస్తోంది. ఆర్య కంటే సాయేషా వయసులో 16 ఏళ్లు చిన్నది కావడం గమనార్హం.