మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 4 మార్చి 2019 (11:51 IST)

కేర్ వ్యాన్ లేదు.. పబ్లిక్ టాయ్‌లెట్‌లో దుస్తులు మార్చుకున్న నటి?

అవును.. సినీ రంగంలో హీరోయిన్లకు కేర్ వ్యాన్లు వుండవని.. వారికి సపరేట్ గదులు వుండవని.. ఎక్కడెక్కడో చెట్ల చాటున హీరోయిన్లు దుస్తులు మార్చుకుంటున్నారని ఇటీవల కొందరు నటీమణులు ఇంటర్వ్యూల్లో చెప్తువస్తున్నారు. ఇక శ్రీరెడ్డి లాంటి వారైతే సినీ రంగంలో మహిళలపై జరుగుతున్న వేధింపులు.. తెలుగమ్మాయిలకు అవకాశాలు ఇవ్వకపోవడం వంటి అంశాలకు నిరసనగా అర్ధనగ్న ప్రదర్శనలు కూడా చేసిన సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో ఓ కోలీవుడ్ నటి కేర్ వ్యాన్ లేకుండా సినిమా సెట్స్‌లోని ఓ పబ్లిక్ టాయిలెట్లో దుస్తులు మార్చుకుంది. ఈ ఘటన ప్రస్తుతం తమిళనాట చర్చనీయాంశమైంది. సినిమా తీసే నిర్మాతలు మహిళలకు తగిన వసతులు కల్పించరా అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. క్యార్ వేన్లు ఇవ్వకపోయినా షెడ్లు కట్టడం వంటివి కూడా చేయరా అంటూ ప్రశ్నిస్తున్నారు.
 
వివరాల్లోకి వెళితే.. కోలీవుడ్ యంగ్ హీరోయిన్ సృష్టి డాంగే 2010లో విడుదలైన కాదలి (ప్రేయసి) అనే సినిమా ద్వారా తమిళ సినీ రంగంలోకి తెరంగేట్రం చేసింది. ఆపై పదిహేను సినిమాలపైగా నటించింది. ప్రస్తుతం మలయాళ సినిమాల్లోనూ నటిస్తోంది. ఈ నేపథ్యంలో కోలీవుడ్ నటుడు కదిర్ హీరోగా నటించే శత్రు అనే చిత్రంలో సృష్టి హీరోయిన్‌గా కనిపిస్తోంది. 
 
ఈ సినిమా ఆడియో వేడుకలో హీరోహీరోయిన్లపై ప్రశంసల జల్లు కురిపించాడు దర్శకుడు. ఈ సినిమా కోసం హీరోయిన్ ఒక సన్నివేశం కోసం 20 క్యాస్ట్యూమ్స్ మార్చాల్సి వచ్చింది. కేర్ వ్యాన్ లేకపోయినా.. పబ్లిక్ టాయిలెట్‌లో దుస్తులు మార్చుకుని సన్నివేశాన్ని పండించిందని.. సృష్టిలోని అంకితభావానికి శభాష్ అంటూ కొనియాడారు.