శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: శనివారం, 23 ఫిబ్రవరి 2019 (16:47 IST)

కోడిరామక్రిష్ణ భౌతికకాయం వద్ద అనుష్క నవ్వింది.. ఎందుకు..?

ప్రముఖ దర్శకుడు కోడిరామక్రిష్ణ అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. నిన్న ఎంతోమంది ప్రముఖులు కోడిరామక్రిష్ణ పార్ధీవదేహాన్ని సందర్సించి నివాళులు అర్పించారు. చిరంజీవితో పాటు కోడిరామక్రిష్ణ దర్శకత్వంలో సినిమాలు చేసిన సినీనటులు, నటీమణులు, క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ అందులో ఉన్నారు.
 
అయితే కోడి రామక్రిష్ణ ఇంటికి తెల్ల డ్రస్సుతో వచ్చారు అనుష్క. మొదట్లో కోడి రామక్రిష్ణ పార్థీవ దేహాన్ని తదేకంగా చూస్తూ బాధపడ్డారు. ఆ తరువాత కొద్దిసేపటికి తన పక్కనే కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉంటే వారితో మాట్లాడుతూ కనిపించారు. 
 
మాట్లాడుతూ మాట్లాడుతూ ఉన్నట్లుండి గబుక్కున నవ్వేశారు. దీంతో అక్కడున్న వారందరూ ఆశ్చర్యంగా అనుష్కను చూస్తూ ఉండిపోయారు. తను చేసిన తప్పును తెలుసుకుని అనుష్క ఆ తరువాత సైలెంట్‌గా ఉండిపోయారు. పిచ్చాపాటీ మాట్లాడుతూ అనుష్క నవ్వినట్లు తెలుస్తోంది.