సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 12 డిశెంబరు 2018 (13:43 IST)

కఠిన నిర్ణయం తీసుకున్న అనుష్క.. ఇకపై సినిమాలు చేయదట...

తెలుగు చిత్ర సీమలో అగ్రహీరోయిన్‌గా కొనసాగుతున్న అనుష్క అత్యంత కఠిన నిర్ణయం తీసుకుంది. తనకున్న పేరు, క్రేజ్‌ను చెడగొట్టుకోవడం ఇష్టంలేని ఆమె.. తాజాగా ఓ మంచి నిర్ణయం తీసుకుంది. ఇకపై తనకు వచ్చే సినిమాలన్నీ చేయకూడదని నిర్ణయించింది. 
 
నిజానికి అనుష్క నటించిన చిత్రాల సంఖ్య చాలా తక్కువ. కానీ, 'బాహుబలి' తర్వాత ఆమె చేసిన చిత్రాలు వేళ్లపై లెక్కించవచ్చు. ఈ సినిమా కంటే ముందు అనుష్క సంవత్సరానికి కనీసం రెండు మూడు సినిమాలన్నా చేసేది. అయితే ఈ సినిమాతో వచ్చిన క్రేజ్‌ను చెడగొట్టుకోకుండా ఉండాలంటే ఏ సినిమా పడితే ఆ సినిమా చేయకూడదని అనుష్క డిసైడ్‌ అయ్యిందట. 
 
ఇది అనుష్క క్రేజ్, పేరు పరంగా మంచి నిర్ణయమే అయినప్పటికీ అభిమానులకు మాత్రం తీవ్ర నిరాశ కలిగించనుంది. అంటే ఇక నుంచి ఏడాదికి ఒకటి లేదా రెండు సినిమాల్లో మాత్రమే అనష్క కనిపించే అవకాశముందని సినీ జనాలు అంటున్నారు.