గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 23 ఫిబ్రవరి 2019 (12:46 IST)

సీనియర్ నటుడు మోహన్ బాబు ఇంట్లో చోరి..!

మోహన్ బాబు అంటే తెలియని వారుండరు. ఎవరైన కష్టాల్లో ఉన్నారని తెలిస్తే వెంటనే సహాయం చేస్తారు. అలాంటి మోహన్ బాబు ఇంట్లో చోరి జరిగింది. అది కూడా అంతా ఇంతా కాదు.. లక్షల రూపాయాల నగదు, ఆభరణాలు చోరికి గురైనట్టుగా తెలుస్తోంది. దాంతో మోహన్ బాబు ఏం చేయాలో వెంటనే బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్‌‌లో ఫిర్యాదు చేశారు.
 
మా ఇంట్లోని పనిమనిషి మీదే నాకు అనుమానంగా ఉందని మోహన్ బాబు పోలీసులకు వెల్లడించారు. దాంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ మొదలు పెట్టారు. ఇక మోహన్ బాబు మాట్లాడుతూ.. గతంలో మెగాస్టార్ చిరంజీవి ఇంట్లోనూ ఇదే విధంగా చోరి జరిగింది. చిరు ఇంట్లో చాలా రోజులుగా నమ్మకంగా పనిచేస్తున్న వ్యక్తే 2 లక్షల రూపాయిల చోరి చేశాడు. అందుకే నాకు మా ఇంట్లోని పనిమనిషిపై సందేహంగా ఉందని చెప్పుకొచ్చారు.