ధోనీ బ్యాటింగ్‌ను అంతమంది చూశారే? ఆ పిచ్చేంటి? (వీడియో)

Last Updated: శుక్రవారం, 8 ఫిబ్రవరి 2019 (17:15 IST)
భారత్-కివీస్‌ల మధ్య బుధవారం జరిగిన తొలి మ్యాచ్‌లో.. టీమిండియా మాజీ కెప్టెన్ బ్యాటింగ్ చేస్తుండగా, దాదాపు 20 బంతుల్లో వంద పైచిలుకు పరుగులు చేయాల్సింది. ఓడిపోవడం ఖాయమని తేలిపోయినా.. ధోనీ బ్యాటింగ్ చేస్తుండగా.. ఆ మ్యాచ్‌ను 4.8 మిలియన్ల మంది హాట్ స్టార్ లైవ్‌లో చూస్తుండిపోయారు.
 
ఒక అప్లికేషన్లోనే 50లక్షల మంది ధోనీ బ్యాటింగ్ చూస్తుండిపోయారంటే.. ప్రపంచ వ్యాప్తంగా వున్న టీవీలలో ఈ మ్యాచ్‌ను ఎన్ని లక్షల మంది చూస్తువుండివుంటారు. చివరిగా ఆస్ట్రేలియాతో జరిగిన టీ-20 పోటీలో భారత జట్టు గెలుపును నమోదు చేసుకున్న సమయంలో కూడా 50 లక్షలకు తక్కువ మందే హాట్ స్టార్ అప్లికేషన్ ద్వారా మ్యాచ్‌ను వీక్షించారు. కానీ కివీస్‌తో జరిగిన తొలి ట్వంటీ-20లో కేవలం 20 బంతులే చేతిలో వుండగా.. ఒక్కో బంతిని సిక్సర్‌గా మలిచినా వంద పరుగులు పై చిలుకు సాధించడం కష్టం. 
 
అలాంటి మ్యాచ్‌లో హాట్ స్టార్ యాప్ ద్వారా 50లక్షలకు పైబడిన వారు వీక్షించేందుకు కారణం ధోనీనే. ఎందుకంటే.. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా టీమిండియా గెలుపుకు చిన్నపాటి అవకాశాన్ని ధోనీ సృష్టిస్తాడనే నమ్మకంతో క్రికెట్ ఫ్యాన్స్ ఈ మ్యాచ్‌ను చూస్తుండిపోయారు.

చివరి క్షణాల్లోనైనా భారత్ గెలిచేందుకు ధోనీ ఏదైనా దారి చూపిస్తాడా అని క్రికెట్ ఫ్యాన్స్ ఆత్రుతతో ఎదురుచూశారు. దీనికి కారణం క్రికెట్ ఫ్యాన్స్‌కు ధోనీపై వున్న నమ్మకమేనని నెటిజన్లు సోషల్ మీడియాలో అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.దీనిపై మరింత చదవండి :