బుధవారం, 1 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : గురువారం, 7 ఫిబ్రవరి 2019 (14:48 IST)

జెర్సీలో త్రీ స్టార్స్ గురించి తెలుసా? (video)

భారత క్రికెటర్లు ధరించే జెర్సీలో వుండే బీసీసీఐ లోగోకు పైనున్న స్టార్స్ సంగతి ఏంటో తెలుసుకోవాలనుందా.. అయితే ఈ కథనం చదవాల్సిందే. బ్లూ రంగులోని టీమిండియా జెర్సీలోని బీసీసీఐ లోగోకు ఓ ప్రత్యేకత వుంది. మూడుస్టార్ల కోసం పాటుపడిన క్రికెటర్ ఎవరో తెలుసుకుందాం.. ప్రతీ క్రికెట్ సిరీస్‌లోనూ టీమిండియా క్రికెటర్లకు కొత్త జెర్సీలను ఇస్తుంటారు. ఈ జెర్సీకి ఎడమవైపు బీసీసీఐ లోగోతో పాటు దానికి పైన మూడు స్టార్లు వుంటాయి. 
 
ఈ మూడు స్టార్లకు గల అర్థం ఏమిటో చాలామందికి తెలియకపోవచ్చు. ఇందులోని తొలి స్టార్.. 1983లో భారత జట్టు వరల్డ్ కప్ గెలుచుకున్నందుకు గుర్తుగా వుంటుంది. రెండో స్టార్ టీ-20 వరల్డ్ కప్ సాధించినందుకు గుర్తుగా ముద్రించబడింది. అలాగే మూడో స్టార్ 2011లో టీమిండియా వన్డే వరల్డ్ కప్ ట్రోఫీని నెగ్గినందుకు గుర్తుగా ముద్రించబడింది.

ఇలా ఆటగాళ్ల జెర్సీలలో మూడు స్టార్లలో రెండు స్టార్లు లభించేందుకు పాటుపడిన వ్యక్తి మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీనే. ధోనీ కెప్టెన్సీలో భారత్ ట్వంటీ-20, వన్డే ప్రపంచ కప్ ట్రోఫీలను గెలుచుకున్న సంగతి తెలిసిందే.