శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : శనివారం, 17 నవంబరు 2018 (11:39 IST)

నెట్టింట్లో ట్రెండింగ్.. రంగస్థలం పూజితతో దేవీ శ్రీ ప్రసాద్ వెడ్డింగ్?

గతంలో అందాల సుందరి ఛార్మీతో చెట్టాపట్టాలేసుకుని తిరిగి.. ఆపై ఆమెతో బ్రేకప్ తీసుకున్న గాయకుడు దేవీశ్రీ ప్రసాద్ ప్రస్తుతం పెళ్లికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఛార్మీ ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ సంస్థల్లో పనిచేస్తున్న నేపథ్యంలో.. దేవీశ్రీ ప్రసాద్ వివాహం గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. 
 
పూజిత అనే అమ్మాయిని దేవీ శ్రీ ప్రసాద్ పెళ్లి చేసుకోబోతున్నాడని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. పూజిత ఎవరంటే.. రంగస్థలంలో ప్రకాష్ రాజ్ కుమార్తెగా నటించిన అమ్మాయి. పూజితతో దేవి శ్రీ ప్రసాద్ పరిచయం ఎలా అయ్యింది.. వీరిద్దరూ ప్రేమలో వున్నారా అంటూ నెట్టింట చర్చ సాగుతోంది. అయితే ఈ వార్తలపై దేవీశ్రీ ప్రసాద్ కానీ, పూజిత కానీ నోరు విప్పలేదు.