శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Updated : గురువారం, 30 మే 2019 (13:19 IST)

రిసెప్షన్‌లో వధూవరులకు బీర్లు తాగించిన పెద్దలు.. ఎందుకు?

ముహూర్తం దగ్గరపడుతోంది. తాళిబొట్టు, పూజ సామాన్లు తెచ్చారా. అమ్మా.. అన్నింటికంటే ముఖ్యంగా బీరు సీసాలు మాత్రం మర్చిపోకండి నాయనా. ఏంది పెళ్ళి సామాన్లలో బీరు సీసానా. ఇదెక్కడి విచిత్రం అమ్మో. మాకైతే ఎక్కడా బీరు సీసాలు చెప్పలేదమ్మా అంటూ వాపోయారు పెళ్ళి పెద్దలు. ఆ పెళ్ళిలో అసలేం జరిగింది.
 
హైదరాబాద్‌లో ఈ మధ్య జరిగిన ఒక పెళ్ళివేడుకల్లో పెళ్ళికొడుకు, పెళ్ళి కూతురుకు రిసెప్షన్‌లో బీర్లు ఇచ్చారట. పెళ్ళి కొడుకు మూడు సిప్‌లలో బీర్ తాగితే పెళ్ళి కూతురు బీర్ తాగేందుకు తెగ ఇబ్బంది పడిపోయిందట. అయితే పెళ్ళి పెద్దలు మాత్రం ఒప్పుకోలేదట. ఖచ్చితంగా బీరు తాగాలని తేల్చిచెప్పారట.
 
మూడు ముళ్ళు, అక్షింతలే కాదు.. మగాడితో సమానంగా బీర్ తాగాలనేది వారి ఆచారమట. అంటే ఒకసారి మాత్రమే తాగితే చాలు. ఎప్పుడూ తాగాలని కాదు. దీంతో పెళ్ళికూతురు కూడా ఒప్పుకుని బీరు తాగడం మొదలెట్టింది. అయితే పెళ్ళిలో మాత్రం ఎవరూ ఆశ్చర్యపోలేదట. ఎందుకంటే వారి పెళ్ళిళ్ళలో అలా జరగడం మామూలే కాబట్టి.