సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : సోమవారం, 27 మే 2019 (12:03 IST)

బీరు లారీ బోల్తా.. మందుబాబులకు పండగే పండగ

హైదరాబాద్ నగరంలో బీరు లోడుతో వెళుతున్న లారీ ఒకటి బోల్తా పడింది. దీంతో బీరు బాటిళ్లు రోడ్డుపై చిందరవందరగా పడిపోయాయి. ఈ వియం తెలుసుకున్న మందుబాబులు... ఒక్క పరుగున వచ్చి తమకు తోచినన్ని బీరు బాటిళ్ళను పట్టుకెళ్లారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని బేగంపేట వద్ద జరిగింది. 
 
బీరు లోడుతో వెళుతున్న లారీ ఒకటి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌ వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయిన డ్రైవర్ పక్కనే ఉన్న డివైడర్‌ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో లారీ పల్టీలు కొడుతూ బోల్తా పడిపోయింది. దీంతో లారీలో ఉన్న బీరు సీసాలు వాహనం నుంచి రోడ్డుపై పడిపోయాయి. 
 
ఈ విషయం తెలుసుకున్న మందుబాబులు అక్కడకు చేరుకుని బీరు సీసాలను పట్టుకెళ్లారు. ఆ తర్వాత సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మద్యంబాబులను అదుపుచేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన డ్రైవర్, క్లీనర్‌లను రక్షించి ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.