శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శనివారం, 25 మే 2019 (14:41 IST)

కుమార్తె స్నేహితురాలిని లొంగదీసుకుని గర్భవతిని చేశాడు.. పెళ్లే చేసుకోమంటే?

వయోబేధం లేకుండా మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఇలా హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. తన కుమార్తెను చూసేందుకు నగరానికి వచ్చిన స్నేహితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. స్నేహితురాలి తండ్రి చెప్పిన మాయమాటలను నమ్మిన ఆ బాలిక.. అతడికి లొంగిపోయింది. ఈ క్రమంలో గర్భం దాల్చింది. ఈ సంఘటన హైదరాబాద్‌లోని నారాయణగూడ వెలుగుచూసింది. 
 
వివరాల్లోకి వెళితే.. గడియాగవారం గ్రామానికి చెందిన మహ్మద్ షరీఫ్ హలీమ్ తయారీదారుడు. పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు వంటలు చేస్తుండేవాడు. హైదరాబాద్‌లో కింగ్ కోఠి ఏరియాలో ఉంటున్న ఓ ఇంట్లో, షరీఫ్ కూతురు పనిచేస్తోంది. కూతురిని చూసేందుకు నగరానికి వచ్చే షరీఫ్... ఆమె స్నేహితురాలైన ఓ యువతితో పరిచయం పెంచుకున్నాడు.
 
ఆమెకు మాయమాటలు చెప్పి గత సెప్టెంబర్‌లో లైంగిక దాడికి పాల్పడ్డాడు. అతనికి లొంగిపోయిన కూతురు స్నేహితురాలు.. గర్భం దాల్చింది. ఈ విషయం వెలుగులోకి వస్తే అవమానం తప్పదని తెలుసుకున్న ఆమె పెళ్లి చేసుకోమని నిలదీసింది. దానికి అతను సరేనన్నాడు. కానీ తప్పించుకుని తిరిగాడు. దీంతో ధైర్యం చేసుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 
కేసు నమోదుచేసుకున్న పోలీసులు... యువతిపై లైంగిక దాడికి పాల్పడిన మహ్మద్ షరీఫ్‌ను, బెదిరించిన అతని తమ్ముడు మహ్మద్ చంద్‌లను అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు.