భార్యకు కిక్ ఎక్కాక.. స్నేహితుడితో పడక పంచుకోమనే భర్త.. వీడియో తీసి?
భార్యకు ఓ భర్త నరకం చూపించాడు. 2016 నుంచి జరుగుతున్న ఈ ఘటన ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. రోజూ తాగి స్నేహితులను ఇంటికి తీసుకొచ్చే భర్త.. భార్యను స్నేహితులతో పడక పంచుకోవాల్సిందిగా వేధించేవాడు. భార్యతో బలవంతంగా మందు తాగించి.. తన స్నేహితుడితో పడక పంచుకోమన్నాడు. ఇలా భార్యతో స్నేహితుడు గడిపిన తతంగాన్ని వీడియో తీశాడు.
తాగిన మైకంలో ఏం జరిగిందో తెలియకుండా తెల్లారి లేచిన భార్యకు ఆ వీడియో చూపించాడు భర్త. దీన్ని చూసి షాకైన భార్య.. భర్తను నిలదీసింది. ఈ వీడియోను నెట్లో పెట్టేస్తానని.. తాను చెప్పినట్లు చేయకపోతే.. పిల్లాడి చంపేస్తానని భర్త బెదిరించేవాడు. రోజూ ఎవరో ఒక మగాడిని తేవడం.. భార్యతో గడపనివ్వడం చేస్తూ వచ్చాడు ఆ దుండగుడు.
అయితే తల్లి సాయంతో భర్తపై బాధితురాలు పోలీసులు 2019 ఫిబ్రవరిలో కేసు పెట్టింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలి భర్తపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మర్చంట్ నేవీ జాబ్ దృష్ట్యా విదేశాలకు వెళ్లిన ముఖేశ్వర్... ఇండియా రాగానే... ముంబై ఎయిర్‌పోర్టులో అరెస్టు చేశారు. కోర్టు మే 29 వరకూ అతన్ని పోలీస్ కస్టడీకి ఇచ్చింది.