గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 24 మే 2019 (17:48 IST)

తెరవెనుక సర్దుకుపోతే ఛాన్సిస్తారన్నారు... (video)

హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన తెలుగు అమ్మాయి అదితి రావు హైదరీ. "చెలియా" చిత్రం ద్వారా ఆమె వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత సుధీర్ బాబు నటించిన 'సమ్మోహనం' చిత్రంలో అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. అలాంటి అదితి కూడా లైంగిక వేధింపులు తప్పలేదట. 
 
ఆమె తాజాగా మాట్లాడుతూ, సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఉన్నాయని చెప్పారు. ఒక సినిమా విషయంలో తెరవెనుక సర్దుకునిపోతే అవకాశం ఇస్తామని, లేదంటే మరొకరికి ఛాన్సిస్తామని చెప్పారని తెలిపారు. పైగా, అదేదో ఓ ఘనకార్యంలా ఆలోచించి నిర్ణయం చెప్పమన్నారు. 
 
కానీ తాను మాత్రం మరో ఆలోచన లేకుండా అలాంటి అవకాశమే తనకు వద్దని అతని మొహాన్ని చెప్పానని వెల్లడించారు. అదేసమయంలో మనకు ఎదుర్యయే వేధింపులను ధైర్యంగా ఎదుర్కోవాలని కోరారు. మౌనంగా ఉంటే మాత్రం ఆ మౌనాన్ని మరో రకంగా అర్థం చేసుకునే అవకాశం ఉందని అదితి రావు హైదరీ చెప్పుకొచ్చారు.