సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. హాలివుడ్
Written By కుమార్
Last Updated : బుధవారం, 22 మే 2019 (18:30 IST)

రెడ్ కార్పెట్‌పై నడిచి సందడి చేసిన సెలీనా.. 68ఏళ్ల బిల్‌ముర్రేతో వివాహం..

హాలీవుడ్ ప్రముఖ పాప్ సింగర్ సెలీనా గోమెజ్ ఇటీవల కేన్స్ చలన చిత్రోత్సవ వేడుకలో సందడి చేసింది. సెలినా ఈ వేడుకలకు హాజరు కావడం ఇదే ప్రథమం. సెలినా న‌టించిన ‘ది డెడ్‌ డోన్ట్‌ డై’ సినిమాను కేన్స్‌లో ప్ర‌ద‌ర్శించ‌డంతో సెలీనా ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. ఈ సందర్భంగా సెలీనా రెడ్ కార్పెట్‌పై నడిచి సందడి చేసింది. అయితే కేన్స్‌లో షో తరువాత ఆమె తన అభిమానులకు జీర్ణించుకోలేని వార్తను చెప్పారు. 
 
తాను త్వరలోనే వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించింది. అయితే ఆ వ్యక్తి మరెవరో కాదు, తనతో ‘ది డెడ్‌ డోన్ట్‌ డై’ సినిమాలో నటించిన సహచరుడు బిల్ ముర్రే అని ప్రకటించింది. అయితే సెలినా వయస్సు 26 ఏళ్లు కాగా, ముగ్రే వయస్సు 68 ఏళ్లు. ఈ ప్రకటనతో ఒక్కసారిగా అభిమానులంతా షాకయ్యారు. ఈ విషయాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. 68 సంవత్సరాల తాతను సెలీనా వివాహం చేసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.