గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : ఆదివారం, 19 మే 2019 (13:56 IST)

పిల్లల్ని కనాలనే ఉద్దేశ్యం ఏమాత్రం లేదంటున్న పూరీ హీరోయిన్

తెలుగు సీనియర్ హీరోయిన్లలో చార్మీ కౌర్ ఒకరు. ఈమెకు హీరోయిన్స్ చాన్సులు పూర్తిగా కనుమరుగయ్యాయి. పైగా, ఈమె హీరోయిన్‌గా ఉన్న సమయంలోనే సినీ నిర్మాణ రంగంపై దృష్టిసారించింది. ఇపుడు హీరోయిన్ అవకాశాలు లేకపోవడంతో సినీ నిర్మాణ రంగంపై పూర్తిగా దృష్టిసారించింది. అలాగే ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ నిర్మించే చిత్రాల బాధ్యతలను చూసుకుంటుంది. ఈ క్రమంలో చార్మీ పూర్తి స్థాయి నిర్మాతగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రానున్న తాజా చిత్రం ఇస్మార్ట్ శంకర్. 
 
ఈ నేపథ్యంలో ఆమె తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలను వెల్లడించింది. ఇందులో తన వ్యక్తిగత విషయాలకు సంబంధించి పలు అంశాలను వెల్లడించారు. ముఖ్యంగా, తనకు పెళ్లి చేసుకోవాలనే ఆసక్తి లేదని చెప్పింది. పిల్లలను కనాలనే ఉద్దేశం కూడా తనకు ఏమాత్రం లేదని తేల్చి చెప్పింది. వైవాహిక జీవితాన్ని గడపాలనే కోరిక తనకు లేదని వెల్లడించింది. పెళ్లి, పిల్లలు తదితర అంశాలు తనకు ఎంతమాత్రం సెట్ కావని పేర్కొంది. పైగా ఒంటరిగా ఉండేందుకే ఇష్టపడతానని తెలిపింది. కష్టపడి పని చేయడంతో వచ్చే విజయమే తనకు సంతృప్తిని ఇస్తుందని చెప్పుకొచ్చింది. తనకు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదని చార్మీ చెప్పడంతో ఆమె అభిమానులు షాక్‌కు గురవుతున్నారు.